3 నెలల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అందుబాటులోకి 

11 May, 2022 02:12 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి మహమూద్‌ అలీ 

హోంమంత్రి మహమూద్‌ అలీ  

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని, మరో మూడు నెలల్లో దీనిని ప్రారంభిస్తామని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనులను డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

రూ.585 కోట్లతో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనులు 95 శాతం పూర్తయ్యాయని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దీనిని నిర్మిస్తున్నామన్నారు. విదేశీ సాంకేతికతతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఇది అందుబాటులోకి వచ్చాక పోలీస్‌వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు.

డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9.21 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఈ కెమెరాలన్నింటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తామన్నారు.  ఇక్కడ ఒకేసారి  లక్ష సీసీ కెమెరాలను చూసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ విభాగాలను మానిటర్‌ చేయడానికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఇక్కడే ప్రారంభిస్తున్నామన్నారు.  

మరిన్ని వార్తలు