మహిళ అక్రమ నిర్భందం.. అయిదుగురు జీఎస్టీ అధికారులపై కేసు

20 May, 2022 13:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విచారణ పేరుతో వ్యాపారవేత్త భార్యను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో అయిదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో తనను అక్రమంగా నిర్బంధించారని మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలు.. హైరదాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్‌టీ అధికారులు 2019లో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే సోదాల సమయంలో శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డని అధికారులు అక్రమంగా నిర్బంధించారు. 

ఫిబ్రవరి 27, 2019 రోజున తనను సెర్చ్ ఆపరేషన్ పేరుతో అధికారులు నిర్బంధించారని జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు  స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై విచారణ చేయాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. దీంతో బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన హైదరబాద్ పోలీసులు.. అయిదుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా, ఆనంద్ కుమార్, శ్రీనివాస్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే  బొల్లినేని గాంధీ , చిలక సుధా సస్పెన్షన్‌లో ఉన్నారు.
చదవండి: దిశ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తాం!

మరిన్ని వార్తలు