వాట్‌ ఏ టైమింగ్‌: ఆఫర్‌ క్లోజెస్‌ సూన్‌.. ఇప్పుడు కె.జి.యఫ్‌ 2 వంతు

29 Mar, 2022 07:22 IST|Sakshi

హైదరాబాద్‌: మిగిలింది మూడు రోజులే.. మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చ్ 31వ తారీఖులోపు  చెల్లించండి. అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చు కోకండి. ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకు మిత్రమా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అంటూ కె.జి.యఫ్‌ ఛాప్టర్‌ 2 ట్రైలర్‌లోని ఆఫర్‌ క్లోజెస్‌ సూన్‌ డైలాగ్‌ మీమ్‌ను వాడేశారు హైదరాబాద్‌ సిటీ పోలీసులు. 

వాహనదారులు.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికీ కూడా వాహనాల చలాన్‌లను క్లియర్ చేసుకోకుంటే.. వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఇచ్చిన భారీ డిస్కౌంట్ల ఆఫర్‌ ముగిసిపోనుంది కాబట్టి. ఇప్పటికే తెలంగాణలో 50 శాతం ఛలాన్లు క్లియర్‌. 

హయ్యెస్ట్‌ ఎవరంటే.. 
ప్రత్యేకించి.. హైదరాబాద్ సిటీలో పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్‌లో ఉన్నాయి. ఓ స్కూటర్ ఓనర్‌కు.. అత్యధికంగా 178 చలాన్లు ఇంకా ఉన్నాయట. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకి ఈ చలాన్లు ఎక్కువగా పడ్డాయట. ఇక ఆగస్టు 2019 నుండి ఇప్ప‌టివ‌ర‌కు 178 చలాన్ల‌ మొత్తం 48,595 రూపాయలుగా ఉంది. రాయితీ పోను అతను చెల్లించాల్సి వచ్చేది కేవలం రూ. 12,490 మాత్రమే. మరో బైకర్‌కు రూ.73,690 చలాన్లు ఉన్నాయట. అతను ప్ర‌త్యేక రాయితీని ఉపయోగించుకుని 19,515 చెల్లిస్తే సరిపోతుంది. మరి వాళ్లు ఉపయోగించుకుంటారో లేదో? చూడాలి.

మరిన్ని వార్తలు