తాగి బండి నడిపితే చర్యలు..

27 Dec, 2020 19:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాగి బండి నడిపితే చర్యలు తప్పవని హైదరాబాద్‌ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే వారి పనిచేసే  ఆఫీసులకు సమాచారం అందిస్తామని తెలిపారు. మొదటి సారి పట్టుబడితే రూ.10వేలు ఫైన్‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రెండో సారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్‌, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఒక్క డిసెంబర్‌ నెలలోనే 2,351 కేసులు నమోదయ్యాయని, రాచకొండ కమిషనరేట్‌లో ఈ ఏడాది 3,287 కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు