పంజగుట్ట ఫ్లై ఓవర్‌.. ప్రమాదం పైనే ఉంది జర జాగ్రత్త

30 May, 2022 20:08 IST|Sakshi
వేలాడుతున్న వైర్ల ఎన్‌క్లోజర్‌ కట్టలు

సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్‌): పంజగుట్ట ఫ్లై ఓవర్‌ కింద ప్రయాణిస్తున్న వారు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. పంజగుట్ట చౌరస్తాలో ఫ్లై ఓవర్‌ నుంచి కిందికి కేబుల్‌ వైర్ల ఎన్‌క్లోజర్‌ కట్టలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇవి ఏ మాత్రం తెగిపడినా కింద ప్రయాణిస్తున్న వారికి సంకటమే.. సంబంధిత అధికారులు గుర్తించి వీటిని తొలగించడమో లేదా సరిచేయడమే చేయాల్సిన ఎంతైనా ఉంది. 

మరిన్ని వార్తలు