ఇదంతా ప్రభుత్వ కుట్ర: తీన్మార్‌ మల్లన్న

6 Aug, 2021 08:04 IST|Sakshi

సాక్షి, చిలకలగూడ( హైదరాబాద్‌): క్యూ న్యూస్‌ ఛానల్‌ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న గురువారం చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మల్లన్న ఠాణాకు వచ్చారు. పోలీసులు సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కోణాల్లో ఆయనను విచారించారు.

ఆదివారం మరోసారి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. తనను తీన్మార్‌ మల్లన్నబ్లాక్‌ మెయిల్‌ చేయడంతోపాటు బెదిరించాడని, డబ్బు డిమాండ్‌ చేశాడని సీతాఫల్‌మండికి చెందిన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మీకాంత్‌శర్మ  ఈ ఏడాది ఏప్రిల్‌ 22న చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణకు మల్లన్న గురువారం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. మహంకాళి ఏసీపీ రమేష్‌ నేతృత్వంలో చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ నరేష్, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌కుమార్‌ విచారించారు. అనంతరం తీన్మార్‌ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ..న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. ఇదంతా ప్రభుత్వ కుట్ర అన్నారు.  

మరిన్ని వార్తలు