ఓయూలో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం 

4 May, 2022 00:51 IST|Sakshi

ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాద్‌): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులు మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి, మళ్లీ వెనక్కి తీసుకోవడం వల్లే తెలంగాణలో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్‌గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో పోరాడేందుకు సమస్యలు లేకనే రాహుల్‌ గాంధీ రాకను రాజకీయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.  

మరిన్ని వార్తలు