Hyderabad Rain Alert: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

27 Sep, 2022 15:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్‌ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

సికింద్రాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌, అమీర్‌పేట, బషీర్ బాగ్, అబిడ్స్, లకిడికాపుల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్‌ బజార్, బేగం బజార్, అల్వాల్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో వాన పడింది. హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) డీఆర్‌ఎఫ్‌ బృందాలను అప్రమత్తం చేసింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అన్నారు.

మరిన్ని వార్తలు