జలదిగ్భంధంలో వాసునగర్‌

15 Oct, 2020 21:09 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగు కురుస్తున భారీ వర్షాలకు జురాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు 50 గేట్లను అధికారులు ఎత్తి వేశారు. దీంతో కృష్ణానది నీరు పరవళ్ళు తొక్కుతుంది. కృష్ణానదికి ఇన్ ఫ్లో 5లక్షల 5వేల క్యూసెక్కులు కాగా.. దిగువున 5 లక్షల 91 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.73 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9: 657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.08 టీఎంసీలుగా ఉంది. (చదవండి: భారీ వరదలు: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం)

దీంతో కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తుండటంతో సమీప మండలంలోని వాసునగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అధికారులు నగర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తంగిడి వద్ద కృష్ణ బీమా నదుల సంగమం వద్ద ఉన్న భీమేశ్వర ఆలయం చుట్టూ నీళ్లు నిలవడంతో అధికారులు కృష్ణ నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే మత్స్యకారులు ఎవరు నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: భారీ వరద: ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం)

మరిన్ని వార్తలు