బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్‌ జగదీష్‌

9 Oct, 2021 09:28 IST|Sakshi
నాలాలో నుంచి వెలికి తీసిన బైక్‌

సాక్షి, హస్తినాపురం: వనస్థలిపురం సమీపంలోని చింతల్‌కుంటలో శుక్రవారం రాత్రి నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. మహేశ్వరం మండలం మంకాల్‌ గ్రామానికి చెందిన పి.జగదీష్‌ (45) భారీ వర్షంలో బైకుపై వనస్థలిపురం నుంచి ఎల్‌బీనగర్‌ వైపు బయలుదేరాడు. చింతల్‌కుంట వద్దకు రాగానే బైకుతో సహా నాలాలో పడి కొట్టుకుపోయాడు. పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. డ్రైనేజీ నుంచి వాహనాన్ని బయటకు తీశారు.

ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జగదీష్‌ ఆచూకీ లభించింది. నాలాలో పడిపోగానే తాడు దొరకడంతో దాని సాయంతో జగదీష్‌ బయటపడ్డాడు. అనంతరం ఆయన కర్మన్‌ఘాట్‌ లోని తన సోదరుడి నివాసానికి వెళ్లాడు. ఈ విషయాన్ని జగదీష్‌ సోదరుడు వెల్లడించారు.  
చదవండి: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. టైర్‌ నడుముపై నుంచి వెళ్లడంతో

మరిన్ని వార్తలు