హైదరాబాద్‌లో తగ్గిన రిజిస్ట్రేషన్లు!

16 Oct, 2022 18:02 IST|Sakshi

హైదరాబాద్‌లో ప్రతి నెలా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు తగ్గిపోతున్నాయి. ఆగస్టులో 5,656 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్‌ జరగగా.. గత నెలలో 24 శాతం మేర క్షీణించి 4,307లకు పడిపోయాయి. విలువల పరంగానూ తగ్గుదలే నమోదయింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల విలువ రూ.28,453 కోట్లు కాగా.. సెప్టెంబర్‌ నాటికి 16 శాతం 23 శాతం మేర తగ్గి రూ.21,978 కోట్లకు తగ్గాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.

గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 55 శాతం ప్రాపర్టీలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు మధ్య విలువ ఉన్నవే. అలాగే 75 శాతం గృహాలు వెయ్యి చ.అ. నుంచి 2 వేల చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్నవే జరిగాయి. గ్రేటర్‌లో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు రూ.25,094 కోట్ల విలువ చేసే 50,953 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.27,640 కోట్ల విలువ చేసే 62,052 యూనిట్లుగా ఉన్నాయి.

చదవండి: ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా..

మరిన్ని వార్తలు