గిన్నిస్‌ బుక్‌లో రికార్డులు సృష్టిస్తున్న శ్రీ వాస్తవ.. ఇంతకీ ఏం చేస్తోంది

24 Nov, 2021 12:22 IST|Sakshi

కాగితపు బొమ్మల తయారీలో శివాలికి 13 గిన్నిస్‌ రికార్డులు 

పటాన్‌చెరు: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన శివాలి శ్రీవాస్తవ తన రికార్డులను తానేబద్దలు కొడుతోంది. ఆమె చేసిన కాగితపు బొమ్మలను మరో రికార్డు కోసం గీతం అధ్యాపకులు మంగళవారం ప్రదర్శించారు. గీతం పూర్వ విద్యార్థి అయిన శివాలి... విద్యార్థిగా ఉన్న కాలంలోనే మొత్తం 13 గిన్నిస్‌ రికార్డులను సాధించింది. ఆరెగామీ పేపర్‌తో రూపొందించిన ఆకృతులు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో నమోదయ్యాయి.

ఆమె పేరిట ప్రస్తుతం 13 గిన్నిస్‌ రికార్డులు ఉన్నాయి. అలాగే 15 అసిస్ట్‌ వరల్డ్‌ రికార్డులు, నాలుగు యూనిక్‌ వరల్డ్‌ రికార్డులనూ నెలకొల్పింది. ఈ ప్రదర్శనకోసం ఆరెగామి పేపర్‌తో ఆమె రెండు వేల నెమళ్లు, 1,600 కుక్కల బొమ్మలను తయారు చేసింది. అలాగే 5,500 బూరెలు, 6 వేల నిమ్మ తొనలు, ఇరవై వేల చేపలు, ఏడు వేల వేల్స్‌తో పాటు నాలుగు వేల క్విల్లింగ్‌ దేవదూతలు, 3,200ల క్విల్లింగ్‌ బొమ్మలను తయారు చేసి వాటిని ఒక చోట ప్రదర్శించింది. ఆమె ప్రదర్శనను రికార్డు చేసి గిన్నిస్‌ అధికారులకు పంపినట్లు గీతం అధ్యాపకులు తెలిపారు. గిన్నిస్‌ అధికారుల ఆమోదం పొందితే ఆమె పేరిట మరో 8 రికార్డులు వచ్చే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు