స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్‌: కేటీఆర్‌

27 May, 2022 01:25 IST|Sakshi

దేశంలో ఆవిష్కరణల సంస్కృతి పెరిగినపుడే అన్ని రంగాల్లో వేగంగా పురోగతి సాధ్యమవుతుందని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. భారత స్టార్టప్‌ల రంగంలో అద్భుత విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులతో గురువారం దావోస్‌లో జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆవిష్కరణలు వ్యాపార, వాణిజ్య అవకాశాలు సృష్టించడంతో పాటు విభిన్న సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతాయని చెప్పారు. అయితే ఇవి కేవలం శాస్త్ర సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే ఇతర సమస్యలకు కూడా పరిష్కారం చూపాలన్నారు.

తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ ‘టీ హబ్‌’ నిర్మా ణం, పాఠశాల స్థాయి నుంచే ఆవిష్కరణలపై అవగాహన కోసం ‘తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌’ ఏర్పాటు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.  భవిష్యత్తులో హైదరాబాద్‌ స్టార్టప్‌లకు రాజధానిగా మారుతుందన్నారు. చర్చా గోష్టిలో పాల్గొన్న యూని కార్న్‌ స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులు తమ అనుభవాలు, విజయగాథలను పంచుకున్నారు. ప్రశాంత్‌ పిట్టి (ఈజ్‌ మై ట్రిప్‌), విధిత్‌ ఆత్రే (మీషో) సచిన్‌దేవ్‌ దుగ్గల్‌ (ఏఐ), నిఖిల్‌ కామత్‌ (జెరోధా) ఆవిష్కరణల రంగం భవిష్యత్తు, అవకా శాలపై అభిప్రాయాలు తెలియజేశారు. దేశంలో ద్రవోల్బణం, జీడీపీ, తలసరి ఆదాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వాలు మారి నా 2 దశాబ్దాల పాటు ఆవిష్కరణల రంగంపై విధానపరమైన స్థిరత్వం ఉండాలని సూచించారు.  

>
మరిన్ని వార్తలు