పారిస్‌ ఓట్‌ కుట్యూర్‌ వీక్‌లో సుధారెడ్డి

5 Jul, 2022 02:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక పారిస్‌ ఫ్యాషన్‌ ఓట్‌ కుట్యూర్‌ వీక్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంథ్రపిస్ట్‌ సుధారెడ్డి పాల్గొంటున్నారు. మంగళవారం నుంచి 7 వరకు ఈ షో జరగనుంది. ఈ ఓట్‌ కుట్యూర్‌లో భారత్‌ నుంచి ఢిల్లీకి చెందిన డిజైనర్‌ రాహుల్‌ మిశ్రాతో పాటు సుధారెడ్డి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సినిమా రంగానికి సంబంధం లేకుండా దక్షిణ భారత దేశం నుంచి పాల్గొంటున్న మొట్టమొదటి సెలబ్రిటీ డిజైనర్‌ సుధారెడ్డి కావడం విశేషం.

యూరోపియన్‌ లగ్జరీ, ఇండియన్‌ హెరిటేజ్‌ మధ్య సమతుల్యతను చాటుతూ క్రిస్టియన్‌ డియోర్, బాల్‌మైన్, చానెల్, అర్మానీ తదితర వస్త్ర శైలులను సుధ అక్కడ ప్రదర్శించను న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘ప్రపంచంలోని సృజనాత్మక శైలులకు పట్టంగట్టే వేదిక పారిస్‌ కుట్యూర్‌ వీక్‌. మనదేశంలో వారసత్వంగా వస్తున్న కళలను ఇక్కడ హైలైట్‌ చేయడం నా ప్రధాన ఎజెండా.

ఇది భారత దేశపు సంప్రదాయ హస్తకళకు దక్కిన గౌరవం అనుకుంటున్నాను’’ అని చెప్పారు. వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య అయిన సుధారెడ్డి, మేఘా గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ సామాజిక కార్యక్రమాలకూ నాయకత్వం వహి స్తున్నారు. ఫౌండేషన్‌ ద్వారా పేద మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ, విద్యపై దృష్టి సారిస్తు న్నారు.

ఎలిజబెత్‌ హర్లీతో కలిసి బ్రెస్ట్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లల గురించి అవగాహన కల్పించడానికి అమెరికన్‌ నటి ఎవా లాంగారి యాతో కలిసి పని చేస్తున్నారు. 2022లో తెలంగాణ ప్రభుత్వం నుంచి చాంపియన్‌ ఆఫ్‌ చేంజ్‌’,  2021లో ఫిక్కీ నుంచి ‘యంగ్‌ ఇండియన్‌ ఉమెన్‌ అచీవర్‌’ అవార్డులను అందుకున్నారు. 

>
మరిన్ని వార్తలు