పొంటాక్‌తో టీ–హబ్‌ భాగస్వామ్యం 

13 Jul, 2022 02:16 IST|Sakshi
టీహబ్‌లో పొంటాక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దృశ్యం  

రెండింటి మధ్య అవగాహన ఒప్పందం 

భారతీయ స్టార్టప్‌లు యూకే మార్కెట్‌తో అనుసంధానం 

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక ఆధారిత స్టార్టప్‌లకు ఊతమివ్వడం ద్వారా దేశంలోని ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహమిచ్చేందుకు ‘టీ–హబ్‌’మరో కీలక అడుగు ముందుకేసింది. బ్రిటన్, అమెరికా, భారత్, కెనడాలో ఆవిష్కరణల నిధిని సమకూర్చడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పొంటాక్‌ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో టీ–హబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, పొంటాక్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ ప్రేమ్‌ పార్థసారథి ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు.

ఏడాది పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా టీ–హబ్‌ కొత్త భవన్‌లో పొంటాక్‌ నూతన శాఖ ఏర్పాటుకు వీలుగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. టీ–హబ్‌లో పురుడు పోసుకునే స్టార్టప్‌లను యూకే మార్కెట్‌తో అనుసంధానం చేసేందుకు వీలుగా పొంటాక్‌ టీ–హబ్‌తో కలిసి నిధులు సమకూరుస్తుంది. యూకే, భారత్‌లో స్టార్టప్‌లు మరింత వృద్ధి, మరిన్ని నిధులకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని శ్రీనివాస్‌రావు తెలిపారు.

పొంటాక్‌ ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని, ఈ ఏడాది చివరిలోగా మరో ఐదు కంపెనీల్లో పెట్టుబడులు పెడతామని ప్రేమ్‌ పార్థసారథి వెల్లడించారు. పొంటాక్‌ అనుబంధ కంపెనీలు మైనీబో, మాక్స్‌బైట్‌ ద్వారా స్థానికంగా రాబోయే రోజుల్లో 5వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 

మరిన్ని వార్తలు