ఖండాంతరాలు దాటిన ప్రేమ.. పెద్దలు అంగీకరించకపోడంతో..

24 Oct, 2021 10:15 IST|Sakshi

సాక్షి, సుభాష్‌నగర్‌(హైదరాబాద్‌): వారి ప్రేమ ఖండాంతరాలు దాటింది. 5 ఏళ్ల క్రితం వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసి ఎట్టకేలకు పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. గాజులరామారం ప్రాంతానికి చెందిన నల్లూరి రఘు మాస్టర్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి ప్రస్తుతం నగరంలోని అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 2016 సంవత్సరంలో అమెరికాలో చదువుతున్న సమయంలో ఆన్‌లైన్‌ సెర్చ్‌లో బటెన్‌ కిస్ట్రా మ్యారీతో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.

ఈ నేపథ్యంలో 2019లో రఘు హైదరాబాద్‌కు వచ్చి జాబ్‌లో సెటిల్‌ అయ్యాడు. ఇటీవల తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తన ప్రేమ విషయం తెలుపగా వారు నిరాకరించారు. పలు సంబంధాలు చూస్తున్న తరుణంలో కట్నం, ఆస్తి, కులం తదితరాలపై పదేపదే ప్రశ్నలు రావడంతో రఘుకు ఇవి నచ్చేవి కావు. దీంతో ఎట్టకేలకు అమెరికాలో పరిచయమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులను ఒప్పించాడు.

3 ఏళ్ల తరువాత బటెన్‌ క్రిస్టామ్యారీకి ఫోన్‌ చేయగా వివాహానికి ఒప్పుకుంది. శుక్రవారం సూరారంలోని కుత్బుల్లాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్‌ జ్యోతి సమక్షంలో ఇరువురు రిజిస్టర్‌ వివాహం చేసుకుని ఒకటయ్యారు.

చదవండి: మాస్కు ధరించకుంటే మూడో వేవ్‌ తప్పదు

మరిన్ని వార్తలు