కరోనా వైరస్‌: అమెరికా వీసాలకు బ్రేక్‌

28 Apr, 2021 08:27 IST|Sakshi

హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల నేపథ్యంలో మే 3 నుంచి అన్ని రకాల రోజువారీ వీసాల జారీ ప్రక్రియను రద్దు చేసినట్లు హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ మంగళవారం ప్రకటించింది. తదుపరి ప్రకటన చేసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. అన్ని రకాల నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు, ఇంటర్వ్యూ మాఫీ చేసి అపాయింట్‌మెంట్లు సైతం రద్దు చేసినట్లు వెల్లడించింది.

అమెరికా పౌరుల కోసం అన్ని రకాల రోజువారీ సేవల అపాయింట్‌మెంట్లను ఏప్రిల్‌ 27 నుంచి రద్దు చేసినట్టు తెలిపింది. అమెరికా పౌరులకు అత్యవసర సేవలు, వీసా అపాయింట్‌మెంట్లు కొనసాగుతాయని పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం అత్యవసర అపాయింట్‌మెంట్లను యథాతథంగా జరుపుతామని తెలిపింది.
చదవండి: 50% ప్రయాణికులతోనే ఆర్టీసీ బస్సులు

మరిన్ని వార్తలు