టీకా స్లాట్‌ బుక్‌ చేసినా.. తిప్పలు తప్పట్లేదు

8 May, 2021 08:53 IST|Sakshi

సాక్షి,కుత్బుల్లాపూర్‌( హైదరాబాద్‌) : నానా పాట్లు పడి స్లాట్‌ బుక్‌ చేసుకుని వ్యాక్సిన్‌ సెంటర్లకు వెళ్తే అక్కడ గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక సెంటర్‌లో వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు స్లాట్‌ తీసుకొని వెళ్తే, అక్కడ టోకెన్లు ఇచ్చి తర్వాత లోపలికి పంపిస్తున్నారు. మరో సెంటర్‌ వద్ద స్లాట్‌లోని టైమింగ్‌తో సంబంధం లేకుండా క్యూలో నిలబడాలని చెప్తున్నారు. దీంతో వ్యాక్సిన్‌ కోసం వచ్చినవారు నానా అవస్థలు పడుతున్నారు.  
►  వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద  ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో టీకా కోసం వచి్చన వారు తమ వంతు వచ్చేంత వరకు చెట్లనీడలో, సమీపంలోని దుకాణాల మెట్లపై, ఎండలోనూ ఉసూరుమంటూ వేచి ఉండాల్సి వస్తోంది.   
►  ఒక షాపూర్‌నగర్‌ సెంటర్‌లో టెంట్‌ వేసినప్పటికీ అది సరిపోకపోవడంతో వచి్చనవారు ఎండలు నిరీక్షించాల్సి వస్తోంది.  
►  ఆరోగ్య కేంద్రం వద్ద చెట్టు కింద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. 
►  గాజులరామారం సెంటర్‌ వద్ద లోపలికి వెళ్లడానికి జనం పోటీ పడుతుండటంతో   ఒక్కొక్కరిని సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు.
 
కష్టాలు తప్పడం లేదు 
నేను మా అమ్మకు వ్యాక్సిన్‌ వేయించడానికి ప్రైవేట్‌ హాస్పిటల్‌లో స్లాట్‌ బుక్‌ చేశా. అది క్యాన్సిల్‌ అయిందని మెసేజ్‌ రావడంతో మళ్లీ స్లాట్‌ బుక్‌ చేసుకుంటే కుత్బుల్లాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొరికింది. తీరా ఇక్కడి వస్తే..  టోకెన్లను తీసుకోవాలని చెప్పారు. దీంతో టోకెన్ల కోసం పోటీ పడాల్సి వస్తోంది.  స్లాట్‌ దొరకటం ఒక ఎత్తయితే, ఇక్కడ టోకెన్‌ పొంది లోపలికి వెళ్లడం మరో ప్రయాసగా మారుతోంది. కూర్చోవడానికి సదుపాయం లేకపోవడంతో వ్యాక్సిన్‌ కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఈ చెట్ల కింద కుర్చీలు ఏర్పాటు చేస్తే పెద్దవారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయమై అధికారులు ఆలోచించాలని కోరుతున్నా. 
 –  నన్ను, న్యూవివేకానంద్‌నగర్‌  

( చదవండి: కరోనా: మాత్రలు వద్దు.. పౌష్టికాహారమే ముద్దు )

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు