మంత్రుల క్వార్టర్స్‌ ముట్టడికి వీఆర్‌ఏల ప్రయత్నం

13 Sep, 2022 01:57 IST|Sakshi
మంత్రుల క్వార్టర్స్‌ వద్ద వీఆర్‌ఏలను  అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు 

అదుపులోకి తీసుకున్న పోలీసులు 

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): తమ సమస్యలపై సీసీఎల్‌ఏ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ సోమవా­రం వీఆర్‌ఏ జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌ఏలు బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్స్‌ ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 60 మంది వీఆర్‌ఏలు సమస్యలపై గళమెత్తేందుకు మంత్రుల క్వార్టర్స్‌ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసుల నుంచి తప్పించుకొని గేటు దూకేందుకు యత్నించిన పలువురు వీఆర్‌ఏలను పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు యత్నించగా ఉభయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీఆర్‌ఏ జేఏసీ ప్రతినిధులు దాదేమియా, వెంకటేష్, నర్సింహ్మ, హరినాథ్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ సీఎం హామీ ప్రకారం పే స్కేల్‌ జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు