మాస్క్‌ ఉంటేనే మసీదులోకి..

14 Apr, 2021 10:33 IST|Sakshi

నెలవంక దర్శనంతో ఇషాకి నమాజ్‌

నేటి నుంచి పవిత్ర రంజాన్‌ ప్రారంభం

 మాస్క్‌ ఉంటేనే మక్కా మసీదులోకి ప్రవేశం

 సందర్శకులకు అనుమతి లేదు

చార్మినార్‌: ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్‌ మాసం ప్రారంభం అయింది. మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషాకి నమాజ్‌ నిర్వహించారు. అనంతరం మక్కా మసీదు కతీబ్‌ రిజ్వాన్‌ ఖురేషీ తరావీ పవిత్ర ఖురాన్‌ను పఠించారు. రంగురంగుల విద్యుత్‌ దీపాలతో మక్కా మసీదును అలంకరించారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందు సందర్భంగా ముస్లింలకు నెల రోజుల పాటు పంపిణీ చేయడానికి వెయ్యి కిలోల ఖర్జూరం సిద్ధం చేశామని మక్కా మసీదు సూపరింటెండెంట్‌ ఎం.ఎ.ఖాదర్‌ సిద్దిఖీ అన్నారు.  

►ప్రతి రోజు పంపిణీ చేయడానికి 100 డజన్ల అరటి పండ్లను మైనార్టీ సంక్షేమ శాఖ మంజూరు చేసిందన్నారు. 
►కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మక్కా మసీదులో నిర్వహించే సామూహిక ప్రార్థనల్లో పాల్గొనే ముస్లింలు విధిగా మాస్క్‌ ధరించాలని సూచించారు.  
►మసీదుకు వచ్చేవారు తమ ఇళ్ల వద్దే వజూ చేసుకొని వెంట జానిమాజ్‌లు తెచ్చుకోవాలన్నారు.  
►మాస్క్‌లు ధరించకపోతే.. పోలీసులు మక్కా మసీదు లోనికి అనుమతించరని స్పష్టం చేశారు.  
►60 ఏళ్లు పైబడిన వారితో పాటు 10 ఏళ్ల లోపు చిన్నారులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన రాదని కోరారు.  
►మక్కా మసీదులోకి విజిటర్స్‌కు అనుమతి లేదని.. నమాజులు, ఇఫ్తార్‌లు, తరావీలను భౌతికదూరం పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు.

( చదవండి: ఉపవాసం ఉండి వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు)

మరిన్ని వార్తలు