బాబోయ్ డంపు.. తట్టుకోలేక ప్రజలు..

20 Aug, 2021 11:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్‌లోని డంపింగ్‌ యార్డుతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలాకాలం నుంచి దీనిని ఇక్కడ నుంచి తరలించాలని అధికారులను వేడుకుంటున్నా ఎవరూ స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం బాచుపల్లిలోని సర్వే నెంబర్‌ 186లో ప్రభుత్వ స్థలంలో అధికారులు డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేశారు. అయితే నిత్యం యార్డు నుంచి వెలువడే దుర్వాసనలు, చెత్తను కాల్చడంతో ఎగసి పడుతున్న మంటలు, పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి ఇక్కడ నుంచి తరలించాలనే డిమాండ్‌ ప్రజల్లో ఊపందుకుంది. డంపింగ్‌ యార్డుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

► నిజాంపేట్‌ కార్పొరేషన్‌ బాచుపల్లిలోని సర్వే నంబర్‌ 186లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో చెత్త డంపింగ్‌ యార్డును గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. 

► రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో ఇళ్ల నుంచి సేకరించిన చెత్త టన్నుల కొద్దీ పెరుగుతోంది. ఇలా ప్రతి రోజు నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్‌ ప్రాంతాల్లోని 96 కాలనీల్లో, బస్తీలు, గేటెడ్‌ కమ్యూనిటీల నుంచి సుమారు 120 టన్నులకు పైగా చెత్తను సిబ్బంది సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. 

► అయితే ఇక్కడ చెత్తను ఇక్కడ వేరు చేసి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలించడం అసలు ఉద్దేశం. 

► కానీ నేడు ఏకంగా ఇక్కడే  డంపింగ్‌ యార్డు ఏర్పాటైంది. దీంతో డంపింగ్‌ యార్డును తరలించాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.    

విష వాయువులతో ఉక్కిరి బిక్కిరి...
► చెత్త తరచూ తగులబెడుతుండటంతో డంపింగ్‌ యార్డు రావణ కాష్టంలా నిత్యం మండుతూనే ఉంది. 

► గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఆసుపత్రి వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. 

► అయితే ఈ చెత్తను సిబ్బందే తగుల బెడుతున్నారా.? లేక ఏదైనా రసాయన చర్య వల్ల మండుతోందా.. అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. 

► ఈ మంటలతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

► అసలే దుర్వాసన ఆపై ఘాటైన పొగతో ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

► మంటల మూలంగా వాతావరణంలో అనేక వాయువులు విడుదల అవుతున్నాయి. దీంతో  ప్రజలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. 

ఆందోళనలో స్థానికులు..  
► డంపింగ్‌ యార్డు ఏర్పాటుతో తమకు ప్రశాంత జీవనం కరువైందని హిల్‌ కౌంటీ, సాయినగర్‌ కాలనీ, అదిత్య గార్డెన్, రాజీవ్‌ గృహకల్ప, బండారి లేఅవుట్, జర్నలిస్ట్‌ కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డంపింగ్‌ యార్డు పక్కనే నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ప్రారంభైతే  ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన డంపింగ్‌ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. 

విష జ్వరాల బారిన ప్రజలు... 
► డంపింగ్‌ యార్డు కారణంగా రోజుల తరబడి చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు  వృద్ధి చెందుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు మలేరియా, డెంగీ లాంటి విషజ్వారా

మరిన్ని వార్తలు