‘నేను అరెస్టులకు, బెదిరింపులకు భయపడను’

27 Dec, 2022 15:25 IST|Sakshi

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రజాకర్షక పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సేకరించిన కేసులో హీరా గోల్డ్‌ గ్రూప్‌ అధినేత నౌహీరా షేక్‌పై చేపట్టిన ఈడీ విచారణ ముగిసింది.

ఈడీ విచారణ అనంతరం నౌహీరా షేక్‌ మాట్లాడుతూ..  ‘హీరా గ్రూపులో పెట్టిన పెట్టుబడిదారులను ఎవ్వరిని మోసం చేయలేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు నేను పూర్తిగా సహకరిస్తున్నాను.డిపాజిట్ దారులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్‌కు రెండింతలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్వెస్టర్ల డబ్బులను న్యాయస్థానల్లో డీడీ రూపంలో ఇప్పటికే డిపాజిట్ చేశాను.

సుప్రీంకోర్టు లో ఆస్తులను అమ్ముకునేందుకు తీర్పు అనుకూలంగా వచ్చాయి. ఇప్పటి వరకు డిపాజిటర్ల తిరిగి చెల్లించిన వివరాలు ఈడీకి సమర్పించాను. ఇకపై నా ఇన్వెస్టర్లతో కలిసి వ్యాపారం కొనసాగిస్తాను. నేను పొలిటికల్ పార్టీ  ప్రకటించాగానే మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేశారు. రాజకీయ ఒత్తిడ్ల తోనే నాపై అక్రమ కేసులు పెట్టారు. నేను అరెస్టులకు, బెదిరింపులకు  భయపడను’ అని నౌహీరా షేక్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు