పోరాట కేంద్రంగా ‘సీసీఐ’ సెల్ఫీ పాయింట్‌

9 Feb, 2022 03:13 IST|Sakshi

అందరూ సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో పెట్టాలి: రామన్న

ఆదిలాబాద్‌ టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఫ్యాక్ట రీని పునఃప్రారంభించాలనే ఉద్యమి స్తున్న సీసీఐ సాధన కమిటీ కొత్త పోరాట రూపాన్ని ఎంచుకుంది. నెల రోజులుగా ఆందోళన చేస్తున్న కమిటీ.. తమ పోరాటాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం ‘ఐ లవ్‌ సీసీఐ’ పేరుతో ఆదిలాబాద్‌ పట్టణంలో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలు, యువకులు ఇక్కడ ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్టు చేసి కేంద్రానికి చేరేలా షేర్‌ చేయాలని నిర్ణయించారు.

ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సెల్ఫీ పాయింట్‌ వద్ద మొదటి ఫొటో దిగి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణ అంశం ప్రజా ఉద్యమంగా మారు తుందన్నారు. సెల్ఫీ పాయింట్‌ వద్ద ప్రతిఒక్కరూ సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాలని కోరారు. సీసీఐ  పునఃప్రారంభానికి కేంద్రం అనుమతి ఇచ్చే వరకూ పోరాటం కొనసాగుతుందని సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్‌ విజ్జగిరి నారాయణ, నర్సింగ్, రమేశ్, శివ, కిరణ్, మనోజ్, సూరజ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు