ఏ వేవ్‌కైనా సంసిద్ధంగా ఉండాలి: సీఎం కేసీఆర్‌

10 Jul, 2021 01:43 IST|Sakshi

 వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తులో కరోనా మరో వేవ్‌ వస్తుందంటూ వార్తలు విన్పిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులను, నియంత్రణ చర్య లను అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వంతో కలిసి రావాలని, స్వీయ నియంత్రణను పాటిస్తూ కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించా లని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితులపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్షా సమా వేశం నిర్వహించారు.

సరిహద్దు జిల్లాలపై దృష్టి పెట్టండి
రాష్ట్రంలోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరో సారి ఫీవర్‌ సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే అమలు చేసిన జ్వర సర్వే ద్వారా కరోనాను ముందస్తుగా కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యామన్నారు. ‘సరి హద్దు రాష్ట్రాల్లో కరోనా పూర్తిస్థాయిలో నియంత్ర ణలోకి రాలేదు. దీంతో రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కూడా దాని ప్రభావం పూర్తిగా సమసిపోలేదు. అటువంటి ప్రాంతా లను గుర్తించి, శాస్త్రీయ అధ్యయనంతో కరోనా విస్తరణకు గల కారణా లను క్షుణ్నంగా పరిశీ లించాలి. దీనికి సంబం ధించి శాస్త్రీయ పద్ధతు ల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.

వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఆధ్వర్యంలో ఆ శాఖ ఉన్నతాధికారుల బృందం ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో పర్యటించాలి. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్‌ ప్రాంతాల్లో 3 రోజుల పాటు హెలికాప్టర్‌ ద్వారా వరుస పర్యటన లను చేపట్టాలి. జిల్లాల్లో కరోనా విస్తరించడానికి గల ప్రధాన కారణాలను క్రేత్రస్థాయిలో అధ్యయ నం చేయాలి. కరోనా నియంత్రణ కోసం చేపట్టా ల్సిన చర్యలను, ముందస్తు నివారణ కార్యక్రమా లను ప్రత్యేకంగా రూపొందించాలి. దీనిపై నివేది కను కేబినెట్‌కు సమర్పించాలి’ అని ఆదేశించారు.

13న కేబినెట్‌ భేటీ 
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ నెల 13 న మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్‌ భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితరా లపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.  

అంతుచిక్కని సమస్యగా కరోనా
దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి సరైన కారణాలను ఎవరూ గుర్తించలేక పోతున్నారని కేసీఆర్‌ అన్నారు. ‘కరోనా అనేది అంతుచిక్కని సమస్యగా పరిణమిస్తున్నది. దాన్ని కట్టడి చేయడానికి, ముందస్తు నియంత్రణకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలన్నా కూడా ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన లేకుండా పోయింది. ఏ వేరి యంట్, ఏ వేవ్‌ ఎప్పుడొస్తదో ఎందుకు వస్తదో ఎంతవరకు విస్తరిస్తదో తెలియట్లేదు. ఏ రోగాని కైనా దానికి కారణం దొరికితేనే నివారణకు మార్గం సుగమం అవుతుంది. కానీ కరోనా స్వరూ పం, పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి ఉంది. కరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ అప్రమత్తం కావాలి. కరోనా నియం త్రణ కోసం నూతన మార్గాలను అనుసరించాలి. కొత్త వేరియంట్లు, వేవ్‌లపై ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ అవుతూ ప్రజలను కరోనా బారినుంచి రక్షించుకునే చర్యలను చేపట్టాలె..’ అని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ అధి కారులు, సిబ్బంది పనితీరు ఎట్లా ఉన్నది? మం దులు, ఇంజక్షన్ల లభ్యత సక్రమంగా ఉందా? సకా లంలో సరఫరా అవుతున్నయా? బెడ్లు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలను ఎప్పటి కప్పుడు సమీక్షించుకోవాలని సూచిం చారు. వరంగల్‌ పట్టణాన్ని హెల్త్‌ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి, కరోనా ప్రత్యేకాధికారి రాజశేఖర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ తాడూరి గంగాధర్, టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, వైద్య విద్యా డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి, ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు