అదే నా జీవిత ఆశయం : మంత్రి ఈటల

21 Oct, 2020 16:35 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కరోనా వైరస్‌ పూర్తిగా పోలేదని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. ఈ మహమ్మారి వల్ల ఎంతో మంతి ఆత్యీయులను పొగొట్టుకున్నామని, ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటూ కరోనాను తరిమేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాతో 99.5 శాతంపైగా బతికి బయటపడ్డారని, కేవలం 0.5 శాతం మాత్రమే చనిపోయారన్నారు. అయినప్పటికీ కరోనాను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. రాబోయే పండుగలను ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుంపు గుంపులుగా గుమికూడి కోవిడ్‌ వ్యాధిని స్రెడ్‌ చేయవద్దని కోరారు.
(చదవండి : అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్‌)

హుజూరాబాద్‌ ప్రజలు హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా డయాలసిస్‌ సెంటర్‌ను ఇక్కడే ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే హుజూరాబాద్‌లో ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిని కార్పొరేట్‌ ఆస్పత్రిగా అన్ని పరికరాలతో అభివృద్ధి చేస్తానని, అదే తన జీవిత ఆశయమని మంత్రి తెలిపారు. హుజూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ను అన్ని రకాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా