మాకు ఓటేయకుంటే బాగుపడరు.. మంత్రి శాపనార్ధాలు

6 Mar, 2021 03:18 IST|Sakshi

జడ్చర్ల టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న వారు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే బాగుపడరని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘అన్ని తిని ఓటు వేయకుంటే మీకే నష్టం జరుగుతుంది. ఆ కుటుంబం బాగుపడదు. స్పృహలో ఉండి ఓట్లు వేయాలి’అని పేర్కొన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, మీ అందరి మంచి చెడు చూసేటోళ్లమని.. అందుకే తమను ఆదరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపిస్తే మరింత కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు