ఐఐసీటీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు

14 Jul, 2021 14:06 IST|Sakshi

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ).. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 18
► పోస్టుల వివరాలు: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జనరల్‌)–08, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)–05, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎస్‌ అండ్‌ పీ)–05.

► జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జనరల్‌): అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు.

► జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): అర్హత: అకౌంటెన్సీ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు.

► జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎస్‌ అండ్‌ పీ): అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, టైప్‌ రైటింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, సీఎస్‌ఐఆర్‌ ఐఐసీటీ, ఉప్పల్‌ రోడ్, తార్నాక, హైదరాబాద్‌ –500007 చిరునామాకు పంపించాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.08.2021
► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 23.08.2021
► వెబ్‌సైట్‌: https://iictindia.org


ఎన్‌ఐఏబీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 08
► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌(1,2)–04, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–04.

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌
► అర్హత: సంబంధిత లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌ అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 35ఏళ్లు మించకూడదు. ఫెలోషిప్‌: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–1కు నెలకు రూ.31,000+24% హెచ్‌ఆర్‌ఏ, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–2కు నెలకు రూ.35,000+24% హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్‌
► అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు యానిమల్‌ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు. ఫెలోషిప్‌ మొత్తం: నెలకు రూ.20,000+24% హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 19.07.2021
► వెబ్‌సైట్‌:  http://www.niab.org.in

మరిన్ని వార్తలు