దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్‌ అభివృద్ధి

23 Feb, 2022 03:43 IST|Sakshi

స్వదేశీ 5జీ సాంకేతికతలో ముందడుగు

ఓ స్టార్టప్‌ సంస్థతో కలసి హైదరాబాద్‌ ఐఐటీ ఘనత  

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలో 5జీ సాంకేతి కత పరిశోధనలో కీలక ముందడుగు పడింది. తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 5జీ వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నాలజీని వైసిగ్‌ నెట్‌వ ర్క్స్‌ (డబ్ల్యూఐఎస్‌ఐజీ) అనే స్టార్టప్‌ కంపెనీతో కలసి ఐఐటీ హైదరాబాద్‌ సంయుక్తంగా అభివృ ద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఒరాన్‌ (ఓపెన్‌ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌) టెక్నాలజీ సాయంతో తొలి డేటా కాల్‌ను చేసినట్లు ప్రకటించింది.

ఈ మేరకు మంగళవా రం ఇక్కడ ప్రకటన విడుదల చేసింది. 3.3–3.5 జీహెచ్‌జెడ్‌ (గిగాహెర్ట్‌జ్‌) ఫ్రీక్వెన్సీ (పౌనఃపు న్యం) బ్యాండ్‌లో 100 ఎంహెచ్‌జెడ్‌ (మెగా హెర్ట్‌జ్‌) బ్యాండ్‌విడ్త్‌కు సపోర్ట్‌ చేసే మల్టిపుల్‌ ఇన్‌పుట్‌–మల్టిపుల్‌ అవుట్‌పుట్‌ (మిమో) సామర్థ్యంగల బేస్‌స్టేషన్‌ను ఉపయోగించి డేటా కాల్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. లైసెన్సింగ్‌ ప్రాతిపదికన ఈ సాంకేతికతను భారతీయ వైర్‌లెస్‌ పరికరాల తయారీదారులకు అందుబాటులో ఉంచుతు న్నట్లు వైసిగ్‌ నెట్‌వర్క్స్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సాయిధీరాజ్‌ చెప్పారు.

5జీ స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో ఇదో కీలక ఘట్టమని ఐఐటీహెచ్‌ పరిశోధన–అభివృద్ధి విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ కిరణ్‌ కుచి తెలిపారు. తమ పరిశోధన ద్వారా 5జీ, భావి సాంకేతికతల అభివృద్ధిలో భారత్‌ను మరింత ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. 5జీ రంగంలో తమ టెక్నాలజీ దేశాన్ని ఆత్మ నిర్భర్‌గా మార్చగలదని ఆశిస్తున్నట్లు ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు