ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా

23 Nov, 2021 07:46 IST|Sakshi

ఐఐటీ మద్రాస్‌ రూపకల్పన  

IIT Madras Created: దివ్యాంగులు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరో ఒకరి తోడు ఉండాల్సిందే. అలాంటి వారి కోసం ఐఐటీ మద్రాస్‌ తయారు చేసిన బ్యాటరీ వాహనం ఎంతో ఉపయోగపడుతోంది. దానిని ఇంట్లో వీల్‌ చైర్‌లా..బయటకు వెళ్తే స్కూటీలాగా వాడొచ్చు. ఎవరి సహాయం లేకుండా ఒక్కరే ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఒక్కరే దానిని అటాచ్‌ చేసుకునేలా, తొలగించుకునేలా తయారు చేశారు.

(చదవండి: హ్యాట్సాఫ్‌ సార్‌!... హీరోలా రక్షించారు!)

నాలుగు గంటలు చార్జ్‌ చేస్తే ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్‌కు చెందిన శ్రావణ్‌ పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. అప్పటినుంచి ఎవరైనా తోడుంటేనే బయటకు వచ్చాడు. కానీ ఈ వెహికిల్‌ సహాయంతో ఒక్కడే బయటకు రాగలుగుతున్నాడు. కాగా, దీని ఖరీదు రూ.95,000. దీన్ని శ్రావణ్‌ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నట్టు చెబుతున్నాడు. 


– బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి  

మరిన్ని వార్తలు