TS: పలు జిల్లాల్లో వడగండ్ల వానలకు అవకాశం

24 Apr, 2023 08:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. అయితే, దక్షిణ చత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, ఉపరిత ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. సోమవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతాయని సూచించింది. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 39.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 21.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు