హైదరాబాద్‌లో చిరుజల్లులు.. రాగల 48 గంటల పాటు వర్షాలు..

20 Nov, 2021 18:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో గత రెండు రోజుల నుంచి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో శనివారం వాతావరణం ఒక్కసారిగా  చల్లబడింది.  బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్పపీడన ప్ర‌భావంతో నగరంలో శనివారం సాయంత్రం చిరుజ‌ల్లులు కురిశాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాసబ్‌ ట్యాంక్‌, పంజగుట్టతోపాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగాతాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
చదవండి: కుండపోత వర్షాలతో హైదరాబాద్‌ మునక.. ఏటా ఇదే సీన్‌.. అయినా!

కాగా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ  విభాగం అధిపతి కే నాగరత్న తెలిపారు.. హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటిందని.. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపారు. ప్రభావంతో రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని, యాదాద్రి భువనగిరి, నల్గొండలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

మరిన్ని వార్తలు