IT Raids: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడుల కలకలం.. ఆరు బృందాలుగా..

12 Jan, 2023 14:36 IST|Sakshi

హైదరాబాద్‌: ఐటీ అధికారులు హైదరాబాద్‌లో మూడు చోట్ల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.  బాలానగర్‌లోని రెండు కెమికల్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం ఆరు బృందాలతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు.

ఈ కెంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు