ఇండేన్‌ గ్యాస్‌ ఫైబర్‌ సిలిండర్లు

5 Sep, 2021 04:21 IST|Sakshi
గ్యాస్‌ సిలిండర్‌ను ఏపీ మంత్రి బాలినేనికి అందిస్తున్న ఇండియన్‌ ఆయిల్‌  కార్పొరేషన్‌ అధికారులు 

పది కిలోల గ్యాస్‌తో.. తేలికైన సిలిండర్లు 

ఎంత గ్యాస్‌ ఉందనేది సులువుగా గుర్తించొచ్చు 

సాక్షి, హైదరాబాద్‌: తక్కువ బరువుతో తేలికగా, దృఢంగా ఉండే ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్లను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఫైబర్‌తో తయారయ్యే ఈ సిలిండర్లు 10, 5 కిలోల గ్యాస్‌ వేరియంట్లలో ప్రవేశపెట్టింది. సాధారణ సిలిండర్లు ఇనుముతో తయారై, చాలా బరువుగా ఉంటాయి. వాటిలో 14.5 కిలోల గ్యాస్‌ ఉంటుంది. బరువు ఎక్కువకావడంతో వాటిని తరలించడం ఇబ్బందికరం. పైగా చిలుము పట్టడం, వంట గదిలో నేలపై మరకలు పడటం వంటి సమస్యలు ఉంటాయి.

అదే ఫైబర్‌ సిలిండర్లు తేలికగా ఉంటాయి. మోసుకెళ్లడం సులభం. చిలుము, మరకలు వంటివి ఉండవు. మహిళలు కూడా సులువుగా మార్చుకోవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ ఫైబర్‌ సిలిండర్‌ను.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సీనియర్‌ సేల్స్‌ ఆఫీసర్‌ అక్షిత చెన్నంకుట్టి శనివారం హైదరాబాద్‌లో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందచేశారు. 

మరిన్ని వార్తలు