వచ్చే 25 ఏళ్లలో బీజేపీ లక్ష్యమదే: బండి సంజయ్‌

16 Aug, 2021 08:25 IST|Sakshi

విశ్వ గురువుగా భారత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే 25 ఏళ్లలో మోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా భారత్‌ను విశ్వగురువుగా చేసే ఏకైక లక్ష్యం తో ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్‌కుమార్‌ అన్నారు. ఈ తరుణంలో ప్రతి తెలంగాణ వాది బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దాని ద్వారానే మనం నిర్దేశించుకున్న శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమని గుర్తించాలన్నారు.

ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ, ఈ లక్ష్యసాధనలో దేశప్రజలంతా భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, సినీ నటి విజయశాంతి, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి, గీతామూర్తి, జి.విజయరామారావు, గూడూరు నారాయణరెడ్డి, ఎస్‌. ప్రకాశ్‌రెడ్డి, బండా కార్తీకరెడ్డి పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు