ఉత్పాదక రంగంలో అగ్రగామిగా భారత్‌ 

16 Aug, 2021 08:13 IST|Sakshi
జెండా ఎగురవేస్తున్న ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) అమిత్‌ జింగ్రాన్‌

ఎస్‌బీఐ హైదరాబాద్‌ సీజీఎం అమిత్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఉత్పాదక రంగంలో భారత్‌ అగ్రగామి కానుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) అమిత్‌ జింగ్రాన్‌ చెప్పారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్‌ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్లలో సూదుల నుంచి విమానాల వరకు, హైడెల్‌ పవర్‌ నుంచి సోలార్‌ పవర్‌ వరకు, సైకిళ్ల నుంచి లగ్జరీ కార్ల వరకు తయారు చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు.

రైల్వేలు, రోడ్డు, మౌలిక సదుపాయాలు, మెట్రో పట్టాలు మొదలైన వాటిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించిందని తెలిపారు. భారత్‌ అభివృద్ధిలో ఎస్‌బీఐ కీలక ప్రాత పోషిస్తోందని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు