30 వేల మంది విద్యార్థుల జాతీయ గీతాలాపన 

17 Aug, 2022 02:30 IST|Sakshi
మల్లారెడ్డి వర్సిటీలో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న విద్యార్థులు, మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, తదితరులు

మల్లారెడ్డి వర్సిటీకి ‘ఇండియన్‌ బుక్‌’ అవార్డు  

మేడ్చల్‌రూరల్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవా లను పురస్కరించుకుని సామూహిక జాతీయ గీతాలాపనలో మల్లారెడ్డి వర్సిటీ రికార్డు సృష్టించింది. వర్సిటీకి ’ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’అవార్డు దక్కింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి వర్సిటీ క్రీడామైదానంలో మంగళవారం ఉదయం 11.30 గం.కు మంత్రి హరీశ్‌రావు జాతీయజెండా ఆవిష్కరించి సెల్యూట్‌ చేయగా ఏకకాలంలో 30 వేలమంది విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు.

దీంతో ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు వర్సిటీని ‘ఇండియన్‌ బుక్‌’ అవార్డుకు ఎంపిక చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డికి అవార్డును అందజేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. రికార్డు సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మంత్రి మల్లన్నకే సాధ్యమవుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తన జన్మధన్యమైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు