సిటీలో ఇండియన్‌ ఫొటో ఫెస్ట్‌

11 Aug, 2022 02:34 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న అర్వింద్‌కుమార్‌ 

ఈనెల 19 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు.. ఎంట్రీల్లో నుంచి ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఎంపిక

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది అత్యుత్తమ ఫొటోగ్రాఫర్‌ను ఎంపిక చేయడానికి హైదరాబాద్‌ వేదిక కానుంది. ఇండియన్‌ ఫొటో ఫెస్టివల్, హెచ్‌ఎండీఏ, క్రెడాయ్‌ సంయుక్తంగా తొలిసారి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. దీనికోసం 85 దేశాల నుంచి ఫోటోగ్రాఫర్లు తమ అత్యుత్తమ ఫోటోలను ఎంట్రీలుగా పంపించారని ఇండియన్‌ ఫోటో ఫెస్టివల్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ అక్విన్‌ మాథ్యూస్‌ తెలిపారు. ఫొటో జర్నలిజం, డాక్యు మెంటరీ, ట్రావెల్‌ అండ్‌ నేచర్, వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, పోట్రెయిట్, వెడ్డింగ్, మొబైల్స్‌... మొత్తం 8 కేటగి రీల్లో ఎంపికైన అత్యుత్తమ ఫోటోలకు మొత్తం రూ.25లక్షల పారితోషికాన్ని అందించనున్నట్లు చెప్పారు.

ఈ ఫొటో ఉత్సవానికి వచ్చిన ఎంట్రీల ను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడు తూ..   వివిధ దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ఫోటోలను ఈనెల 19 నుంచి వచ్చేనెల 19వరకు మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున ‘ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును బహూకరిస్తామన్నారు. ఈ సందర్భంగా క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడారు.

మరిన్ని వార్తలు