హైదరాబాద్‌: శని, ఆదివారాల్లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌.. ఉత్కంఠగా అభిమానులు

19 Nov, 2022 03:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ వేదికగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ శనివారం ప్రారంభం కానుంది. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఆదివారం కూడా ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఇందుకోసం హెచ్‌ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

పోటీలో 12 కార్లు 24 మంది డ్రైవర్లు తమ సత్తా చాటనున్నారు. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకుల కోసం ట్రాక్‌ మార్గంలో 7 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సుమారు 7,500 మంది ఈ ఈవెంట్‌ను వీక్షించనున్నారు. ఇప్పుడు జరిగేవి ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు మాత్రమేనని, ఫిబ్రవరి 11న ఫార్ములా–ఈ కార్‌ రేసింగ్‌ జరుగుతుందని హెచ్‌జీసీఎల్‌ ఎండీ సంతోష్‌ చెప్పారు.

ట్రాక్‌ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కూడా ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పేర్కొన్నారు. డిసెంబర్‌ 10, 11 తేదీల్లో మరోసారి ఈ పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు