పచ్చి బియ్యం ఇవ్వలేం

31 Aug, 2021 02:34 IST|Sakshi

ఎఫ్‌సీఐ బాయిల్డ్‌ రైస్‌ తీసుకోకపోతే రైతులకు అన్యాయం: మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి సీజన్‌ సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అడిగిన విధంగా రా రైస్‌ (పచ్చి బియ్యం) ఇవ్వలేమని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. యాసంగిలో వరిసాగు కాలంలో అధిక ఉష్ణో గ్రత వల్ల రా రైస్‌ దిగుబడికి అనుకూలంగా ఉండదని, 25 శాతం కంటే అధికంగా నూకలు వస్తాయని, దీన్ని ఎఫ్‌సీఐ తిరస్కరిస్తోందన్నా రు. అందువల్ల ఎఫ్‌సీఐ అడిగినట్లుగా 40 శాతం బాయిల్డ్‌ రైస్, 60 శాతం రా రైస్‌ ఇవ్వ లేమని, 80–90 శాతం వరకు బాయిల్డ్‌ రైస్, మిగిలినవి రా రైస్‌ ఇవ్వగలమని తెలిపారు. ఈ విషయంలో ఎఫ్‌సీఐ తన నిర్ణ యాన్ని పునఃసమీక్షించు కోవాలని విజ్ఞప్తి చేశారు. 

ధాన్యం సేకరణ, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్, ఎఫ్‌ సీఐ నుంచి రావాల్సిన బకా యిలపై సోమవారం పౌర సరఫరాల భవ న్‌లో అధికారులతో శ్రీనివాస్‌రెడ్డి సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 63 లక్షల మెట్రిక్‌ టన్నులకుగాను 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌సీఐ పేర్కొనడం రైతాం గానికి గొడ్డలిపెట్టుగా మారుతోందన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేశాక ఇప్పుడు తీసుకోబోమనడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. ఈ సమస్యను సీఎం కేసీ ఆర్, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలా కర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా సీఎంఆర్‌ గడువును పొడిగించాలని కేంద్రాన్ని కోరారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు