రూ. 6 లక్షలు: ఆధునిక హంగులతో రెడీమేడ్‌ ఇల్లు!

5 Jul, 2021 08:47 IST|Sakshi

కోదాడ రూరల్‌: ఆధునిక హంగులతో రెడీమేడ్‌ ఇంటిని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి ఆదివారం తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన చింత అనంతరాంరెడ్డి హైదరాబాద్‌లోని కొంపెల్లిలో ఉన్న ఓ ప్రైవేట్‌ కంపెనీకి ఆర్డర్‌ ఇస్తే కాంక్రీట్‌ సిమెంట్‌ అవసరం లేకుండా ఫ్యాబ్రిక్‌ మెటీరియల్‌తో ఆధునిక  హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఇందులో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపోయే అన్ని వసతులు ఉన్నాయి.

ఒక హాలు, బెడ్రూం, కిచెన్, టాయ్‌లెట్‌ ఉన్నాయి. దీనికి రూ.6 లక్షలు ఖర్చు అయినట్లు అనంతరాంరెడ్డి తెలిపారు. ఆదివారం ట్రాలీ లారీ సాయంతో దీన్ని గ్రామానికి తీసుకొచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో ఏడెనిమిది అడుగుల ఎత్తులో నిర్మించి ఉన్న పిల్లర్లపై రెండు క్రేన్ల సాయంతో ఏర్పాటు చేసుకున్నాడు. 

మరిన్ని వార్తలు