Inter Supplementary Exams: ఎగ్జామ్‌ సెంటర్‌కు ఒక్కడే.. 8 మంది సిబ్బంది పర్యవేక్షణ

4 Aug, 2022 12:21 IST|Sakshi

వెల్దుర్తి (తూప్రాన్‌): ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రానికి ఒక్క విద్యార్థి హాజరైతే ఎనిమిది మంది సిబ్బంది పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ శ్రీ రాయరావు సరస్వతీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం సివిక్స్‌ పరీక్షకు వర్షపల్లి మహేశ్‌ అనే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు.

మొత్తం ముగ్గురు విద్యార్థులు ఫెయిల్‌ కాగా.. ఒక్క విద్యార్థి ఫీజు చెల్లించి పరీక్ష రాశాడు. పర్యవేక్షణకు చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్, ఎగ్జామినేషన్‌ ఇన్‌చార్జి, ఇన్విజిలేటర్, సహాయ ఇన్విజిలేటర్, జూనియర్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎంతోపాటు కాపలాగా ఒక కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తించారు. పరీక్ష ముగిసిన అనంతరం పరీక్ష పత్రాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు