సిల‌బ‌స్ త‌గ్గింపు ఈ సంవ‌త్స‌రానికే వ‌ర్తింపు

23 Sep, 2020 16:12 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రాల పాఠ్య ప్ర‌ణాళిక‌ను ఈ విద్యా సంవ‌త్స‌రానికి  (2020-21) గాను 30 శాతం త‌గ్గించారు. బోర్డు ప్ర‌తిపాద‌న‌కు ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్రప్ర‌భుత్వం ఆమోదం తెల‌ప‌డంతో తొలిగించిన పాఠ్యాంశాల వివ‌రాల‌ను ఇంట‌ర్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. సీబీఎస్ఈ తొల‌గించిన పాఠ్యాంశాల‌ను ఇక్క‌డా తొలిగించామ‌ని ఇంటర్మీడియ‌ట్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.

క‌రోనా కార‌ణంగా విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ‌టంతో దాదాపు నెల క్రిత‌మే 30 శాతం సిల‌బ‌స్‌లో కోత విధిస్తూ సీబీఎస్ఈ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ట్స్ గ్రూపు స‌బ్జెక్టులైన చ‌రిత్ర‌, ఆర్థిక శాస్త్రం, రాజ‌నీతి శాస్త్రం స‌హా ఇత‌ర స‌బ్జెక్టుల సిల‌బ‌స్‌పై నిపుణుల క‌మిటీల‌తో చ‌ర్చించి వాటి సిఫార‌సు ఆధారంగా త‌గ్గించామ‌ని పేర్కొన్నారు. ఇక సిల‌బ‌స్ త‌గ్గింపు అంశం ఈ సంవ‌త్స‌రానికే వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. 

మరిన్ని వార్తలు