15, 16 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు

4 Feb, 2022 04:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వారసత్వాన్ని, విజ్ఞాన సంప్రదాయాలను పెంపొందించడంలో సాంస్కృతిక సంస్థలు కీలకపాత్ర పోషిస్తాయని సాంస్కృతిక మంత్రిత్వశాఖ తెలిపింది. ‘భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్‌’ అంశంపై ఈనెల 15, 16 తేదీ ల్లో హైదరాబాద్‌లో మొదటి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొం ది. మ్యూజియంలు ఆడియో–విజువల్‌ మార్గాల ద్వారా దేశ సుసంపన్న వారసత్వాన్ని సంరక్షించి, డాక్యుమెంట్‌ రూపంలో భద్రపరచి ప్రదర్శించడంలో ప్రత్యేకత కలిగి ఉంటాయని వివరించింది. సదస్సుకు రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపింది.  

మరిన్ని వార్తలు