జూరాల జలాశయానికి హైడ్రోగ్రాఫిక్‌ సర్వే 

23 Aug, 2021 07:46 IST|Sakshi

త్వరలో ముంబైకి చెందిన నిపుణులు రాక 

గద్వాల రూరల్‌: రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల జలాశయానికి సాగునీటి పారుదల శాఖ అధికారులు త్వరలో హైడ్రోగ్రాఫిక్‌ సర్వే నిర్వహించనున్నారు. త్వరలోనే ముంబైకి చెందిన నిపుణులు బృందం జూరాల జలాశయానికి హైడ్రోగ్రాఫిక్‌ సర్వే చేయనున్నట్లు సాగునీటి పారుదల శాఖ అధికారి ఆదివారం మీడియాకు వివరించారు. 2009లో వచి్చన భారీ వరదల అనంతరం 2012లో జూరాల జలాశయంలోని నీరు, బురదను లెక్కించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబోరేటరీ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం హైడ్రోగ్రాఫిక్‌ సర్వే చేసింది. ఈ సర్వేలో జలాశయం సామర్థ్యం 11.94 టీంఎసీల నుంచి 9.657 టీఎంసీలకు పడిపోయినట్లు సుమారు మూడున్నర టీఎంసీల మేర బురద పేరుకు పోయినట్లు లెక్క తేల్చారు. దీంతో జూరాల కింద 1.20 లక్షల ఆయకట్టు కాస్త 1.07 లక్షలకు కుదించారు. తాజాగా తెలుగు రాష్ట్రాలోని కృష్ణానదిపై ఉన్న జలాశయాల నిర్వహణను కృష్ణాబోర్డు అ«దీనంలోకి తీసుకోనున్న నేపథ్యంలో మరోమారు జలాశయం నీటినిల్వ సామర్థ్యం, ఎంత మేర పూడిక (బురద) పేరుకుపోయిందో లెక్కవేయనున్నారు.
 

మరిన్ని వార్తలు