దేశంలో నంబర్‌వన్‌ బీ–స్కూల్‌గా ‘ఐఎస్‌బీ’

16 Sep, 2021 10:35 IST|Sakshi

ఆసియా–పసిఫిక్‌లో 5వ స్థానం 

ర్యాంకింగ్స్‌ ప్రకటించిన బ్లూమ్‌బెర్గ్‌ బిజినెస్‌ వీక్‌

రాయదుర్గం(హైదరాబాద్‌): ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) దేశంలోనే నంబర్‌వన్‌ బిజినెస్‌ స్కూల్‌గా మరోసారి గుర్తింపు సాధించింది. బ్లూమ్‌బెర్గ్‌ బిజినెస్‌ వీక్‌ ఉత్తమ బీ–స్కూల్స్‌– 2021 ర్యాంకింగ్స్‌ను బుధవారం ప్రకటించారు. ఈ ర్యాంకింగ్స్‌లో ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో 5వ స్థానంలో నిలిచింది. బిజినెస్‌ స్కూల్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ)లో ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. 2021–22 ర్యాంకింగ్స్‌ను ప్రకటించేందుకు బ్లూమ్‌బెర్గ్‌ బిజినెస్‌ వీక్‌ ప్రపంచవ్యాప్తంగా 119 బిజినెస్‌ స్కూల్స్‌ను సర్వే చేసింది.

6,640 మంది విద్యార్థులు, 12,462 మంది పూర్వ విద్యార్థులు, 853 మంది యజమానులను సర్వే చేసి ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. బిజినెస్‌ స్కూల్స్‌లో నిర్వహణ, ఎడ్యుకేషన్‌–లెరి్నంగ్, నెట్‌ వర్కింగ్, ఎంట్రప్రెన్యూర్‌íÙప్‌ వంటి నాలుగు అంశాలను ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్స్‌ను ఇచ్చారు. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో ఐఎస్‌బీ లెరి్నంగ్, నెట్‌ వర్కింగ్‌లో రెండోస్థానం, ఎంట్రప్రెన్యూర్‌íÙప్‌లో మూడో స్థానం, పరిహారంలో ఆరవ స్థానంలో నిలిచింది.

సమష్టి కృషికి నిదర్శనం 
ఐఎస్‌బీ అత్యుత్తమ ర్యాంకింగ్‌ సాధనకు ఫ్యాకల్టీ, అధికారులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సమష్టిగా చేసిన కృషికి నిదర్శనం. ర్యాంకింగ్‌లు మెరుగుపడటంతో మరింత బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేస్తాం.
–ప్రొఫెసర్‌ మదన్‌పిల్లుట్ల– డీన్‌ ఐఎస్‌బీ

మరిన్ని వార్తలు