Kings Palace Owner House IT Raids: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

13 Feb, 2024 09:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 

కాగా గతంలోనూ షానవాజ్‌ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
చదవండి: కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. 

whatsapp channel

మరిన్ని వార్తలు