గవర్నర్‌ పిలిస్తే సీఎస్, డీజీపీలే వెళ్లరు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

11 Jun, 2022 03:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్వహిస్తున్న మహిళాదర్బార్‌ బీజేపీ డైరెక్షన్‌లో ఉందని ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆరో పించారు. రాజకీయంలో భాగంగా ఈ దర్బార్‌ ఏర్పాటు చేస్తున్నారే తప్ప దీంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ జాతరలో గవర్నర్‌కు సంబంధించిన ప్రొటోకాల్‌ పాటించకుండా అవమానపర్చిన అధికారులపై చర్యలు తీసుకోలేకపోయిన తమిళిసై ఇప్పుడు మహిళలకు, రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేయగలరని ప్రశ్నించారు.

గవర్నర్‌ కు ఎలాంటి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, గవర్నర్‌ పిలిస్తే సీఎస్, డీజీపీలు వెళ్లరని, అలాంటప్పుడు తమిళిసైకి ఫిర్యాదు చేస్తే ఏం ప్రయోజనమని అన్నారు. కాగా, టీఆర్‌ఎస్‌–బీజేపీల రాజకీయ సంబం ధం ఏమిటో రాష్ట్రపతి ఎన్నికతో తేలిపోతుందని, తటస్థంగా ఉంటామని ప్రకటిస్తే బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లేనని అన్నారు.  

మరిన్ని వార్తలు