ఉగాది వేడుకల్లో జగ్గారెడ్డి సందడి

3 Apr, 2022 04:17 IST|Sakshi

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డి పట్టణంలోని రామ మందిరంలో శనివారం జరిగిన ఉగాది ఉత్సవాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. ఉగాది సందర్భంగా ఈ మందిరంలో వినూత్న ఆచారం కొనసాగుతోంది. భక్తుల పైకి ప్యాలాల లడ్డూలు (ప్రసాదం) విసురుతూ వందలాది మంది భక్తులకు అందిస్తారు. 40 ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్యాలాల లడ్డూలు విసిరే కార్యక్రమం కొనసాగుతోంది.

మొదట లడ్డూలకు పూజ చేసిన అనంతరం భజన చేస్తూ లడ్డూలను ఊరేగించారు. ఈ ఊరేగింపులో ఎమ్మెల్యే డోలక్‌ వాయిస్తూ పాటలు పాడుతూ భక్తులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆలయంపై నుంచి ఆయన భక్తులపైకి లడ్డూలు విసిరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ భద్రాచలంలో శ్రీరాముని కల్యాణం, తలంబ్రాలు అయ్యాక ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు.

మరిన్ని వార్తలు