కరోనాతో జగిత్యాల అడిషనల్‌ ఎస్పీ మృతి

26 Aug, 2020 08:24 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణ మూర్తి కరోనాతో మృతి చెందారు. వారం రోజుల కిత్రం కోవిడ్‌ బారిన ప‌డిన ఆయ‌న‌.. క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ద‌క్షిణామూర్తి ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించ‌డంతో బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
(చదవండి :10 లక్షలు దాటిన కరోనా టెస్టులు)

1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన కీలక అధికారిగా వ్యవహరించారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కూడా పని చేశారు.ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది తిరిగి విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.దక్షిణ మూర్తి ఆకస్మిక మృతితో జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు