జైలు భోజనం ఎప్పుడైనా రుచి చూశారా?.. ఈ ఫొటోలు చూస్తే వెళ్లకుండా ఉండరేమో.!

7 Jun, 2022 12:11 IST|Sakshi

నిజామాబాద్‌ : కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త థీమ్‌లతో తమ బిజినెస్‌లను ప్రారంభిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో నూతనంగా ఓ మండీ హోటల్‌ను ప్రారంభించారు. నిర్వాహకులు జైలు థీమ్‌తో ఈ హోటల్‌ను ఏర్పాటు చేశారు.

ఇందులో ఇనుప చువ్వలతో కూడిన గదులు, బొమ్మ తుపాకులు, బేడీలు ఏర్పాటు చేశారు. అలాగే ఆహారం సప్లయ్‌ చేసే వారికి ఖైదీ దుస్తులును ఏర్పాటు చేశారు. మండీలోకి వెళ్లగానే ముందుగా ఒక పోలీస్, మరో పక్క ఖైదీ దుస్తులతో స్వాగత ప్రతిమలను ఏర్పాటు చేశారు. జైలు గదుల్లా ఏర్పాటు చేసి అందులో ఆహార ప్రియులకు వడ్డిస్తున్నారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ మండీ నగరవాసులను ఆకట్టుకుంటోంది.  

మరిన్ని వార్తలు